Stock Market: ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • 845 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 246 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • రెండున్నర శాతం వరకు నష్టపోయిన విప్రో షేరు విలువ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... అంతర్జాతీయ మార్కెట్లన్నీ తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఈ క్రమంలో... ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 845 పాయింట్లు కోల్పోయి 73,399కి పడిపోయింది. నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయి 22,272కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (1.24%), నెస్లే ఇండియా (1.22%), భారతి ఎయిర్ టెల్ (0.16%). 

టాప్ లూజర్స్;
విప్రో (-2.47%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.15%), బజాజ్ ఫైనాన్స్ (-2.09%), టాటా మోటార్స్ (-2.05%).

More Telugu News